మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Sri Durga Pancharatnam – శ్రీ దుర్గా పంచరత్నం


తే ధ్యానయోగానుగతా అపశ్యన్
త్వామేవ దేవీం స్వగుణైర్నిగూఢామ్ |
త్వమేవ శక్తిః పరమేశ్వరస్య
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి || 1 ||

దేవాత్మశక్తిః శ్రుతివాక్యగీతా
మహర్షిలోకస్య పురః ప్రసన్నా |
గుహా పరం వ్యోమ సతః ప్రతిష్ఠా
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి || 2 ||

పరాస్య శక్తిః వివిధైవ శ్రూయసే
శ్వేతాశ్వవాక్యోదితదేవి దుర్గే |
స్వాభావికీ జ్ఞానబలక్రియా తే
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి || 3 ||

దేవాత్మశబ్దేన శివాత్మభూతా
యత్కూర్మవాయవ్యవచోవివృత్యా
త్వం పాశవిచ్ఛేదకరీ ప్రసిద్ధా
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి || 4 ||

త్వం బ్రహ్మపుచ్ఛా వివిధా మయూరీ
బ్రహ్మప్రతిష్ఠాస్యుపదిష్టగీతా |
జ్ఞానస్వరూపాత్మతయాఖిలానాం
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి || 5 ||

ఇతి పరమపూజ్య శ్రీచంద్రశేఖరేంద్రసరస్వతీ స్వామి కృతం దుర్గా పంచరత్నం సంపూర్ణమ్ |

 



"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.